జేమ్స్‌ బాండ్‌ హీరో కన్నుమూత

31 Oct, 2020 18:27 IST|Sakshi

బహమాస్: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, జేమ్స్‌ బాండ్‌ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు యూకే మీడియా వెల్లడించింది. జేమ్స్‌ బాండ్‌ పాత్రలతో అలరించిన ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆస్కార్‌తో పాటు మూడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను సీన్‌ కానరీ సొంతం చేసుకున్నారు. 1962లో విడుదలయిన ‘డాక్టర్‌ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్‌ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్‌ రష్య విత్‌ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్‌ ట్వైస్, డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్‌ కానరీ. ఆ తర్వాత  ‘ఆన్‌ హర్‌ మెజెస్టిక్‌ సీక్రెట్‌ సర్వీస్‌’ సినిమాలో జార్జ్‌ లెజెన్బీ బాండ్‌ అయ్యారు.  మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌. జేమ్స్‌ బాండ్‌. సుమారు 58 ఏళ్లుగా ఈ పంచ్‌ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది.

ఇక బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు