Janhvi Kapoor: జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన శ్రీదేవి కూతురు, హీరోయిన్‌ ఏమందంటే?

4 Aug, 2022 16:37 IST|Sakshi

మంచి పాపులారిటీ సంపాదించుకున్న స్టార్‌ కిడ్స్‌లో జాన్వీ కపూర్‌ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా సినిమా చేయనుందని కొంతకాలం నుంచి ఏదో ఒక పుకారు నెట్టింట షికారు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌- కొరటాల శివ మూవీలో జాన్వీ హీరోయిన్‌ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై జాన్వీ స్పందించింది. అది నిజమైతే ఎంత బాగుండో అంటూ మురిసిపోతోంది.

'నిజానికి నేను తెలుగు సినిమా లేదంటే ఏదైనా సౌత్‌ సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. అందులోనూ ఎన్టీఆర్‌తో పని చేసే అవకాశం వస్తే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. ఆయనొక లెజెండ్‌. దురదృష్టవశాత్తూ మీరనుకుంటున్నట్లుగా ఆయన సినిమాలో నాకెలాంటి అవకాశం రాలేదు. కానీ ఆయనతో కలిసి పని చేయడానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను' అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. కాగా జాన్వీ లేటెస్ట్‌ మూవీ 'గుడ్‌లక్‌ జెర్రీ' ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సిద్దార్థ్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ మూవీకి పాజిటివ్‌ స్పందన లభిస్తోంది.

చదవండి: భర్తను టార్చర్‌ పెట్టిన హీరోయిన్‌, ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ ఆలియా..
రిలీజ్‌కు ఒక్క రోజు ముందు భారీ షాక్‌.. అక్కడ ‘సీతారామం’ బ్యాన్‌!

మరిన్ని వార్తలు