Sakshi News home page

Jithender Reddy:  ‘జితేందర్‌ రెడ్డి’ వచ్చేస్తున్నాడు

Published Sun, Mar 31 2024 12:54 AM

jithender reddy movie release date - Sakshi

‘బాహుబలి’ ఫేమ్‌ రాకేష్‌ వర్రే టైటిల్‌ రోల్‌లో రూపొందిన చిత్రం  ‘జితేందర్‌ రెడ్డి’. హిస్టరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌ అనేది ఉపశీర్షిక (చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది), ‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మే 3న రిలీజ్‌ కానుంది. ‘‘జగిత్యాలలో 1980లలో జరిగిన కథే ఈ సినిమా. ఆ రోజుల్లో విలువలతో కూడిన పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకు అందించాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు విరించి వర్మ. ‘‘జరిగిన కథను చూపించాం తప్ప ఎవర్నీ కించపరిచే విధంగా తీయలేదు’’ అన్నారు రవీందర్‌ రెడ్డి.

Advertisement
Advertisement