బాలీవుడ్‌ జాలీ, స్నేహం లేని దారుణమైన పరిశ్రమ: కంగనా

7 Sep, 2021 19:05 IST|Sakshi

Kangana Ranaut Comments On Bollywodd: ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గతంలో ఎన్నో సార్లు బాలీవుడ్‌పై మండిపిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ సింగ్‌ మృతి అనంతరం ఆమె బాలీవుడ్‌ పెద్దలపై, పరిశ్రమలోని బంధుప్రీతిపై విమర్శ వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి కంగనా బాలీవుడ్‌పై నిప్పులు చెరిగింది. కాగా ఆమె తాజా చిత్రం తలైవి మూవీ విడుదల నేపథ్యంలో ఓ డిజిటల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘బాలీవుడ్‌ ఒక విషపూరితమైన పరిశ్రమ. స్నేహం, జాలి లేని దారుణమైనది. బాలీవుడ్‌లో విషాన్ని పెంచి పోషిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే ఇక్కడ ప్రాంతీయ భేదం చూపిస్తారని, ఇక్కడి వారికే ప్రాధాన్యత ఇస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చదవండి: ‘ఐశ్యర్య రాయ్‌కి నటన రాదు, బ్యాడ్‌ యాక్టింగ్‌కు ఉదాహరణ ఆమె’

‘బాలీవుడ్‌ పరిశ్రమకు మనం బయటి నుంచి వచ్చిన వాళ్లం. అందుచేత ఇక్కడ చాలా వైవిధ్యమైన పరిస్థితులను చూడాల్సి ఉంటుంది. అందరూ మనల్ని తొక్కెయాలనే చూస్తారు. బయటి వారిని అసలు ఎదగనివ్వరు. కనీసం ఇక్కడ మద్దతు కూడా దొరకదు. బాలీవుడ్‌ పూర్తిగా విషంతో నిండిపోయింది. ఇక్కడ మనం కోరుకునే సాధారణ పరిస్థితులు ఉండువు’ అంటూ చెప్పకొచ్చింది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 10న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. కంగనా లీడ్‌రోల్‌ పోషిస్తుండగా, అరవింద్‌స్వామి ఎంజీఆర్‌గా అలరించనున్నాడు. కాగా ‘తలైవి’ విడుదల నేపథ్యంలో థియేటర్లు తెరవాల్సిందిగా కంగనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

చదవండి: భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్‌ రొమాంటిక్‌ రిప్లై

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు