Kangana Ranaut: దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుల కేటాయింపుపై కంగనా మండిపాటు

21 Feb, 2023 15:19 IST|Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె వార్తల్లోకి ఎక్కుతుంది. ముఖ్యంగా బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, స్టార్‌ కిడ్స్‌ను టార్గెట్‌ చేస్తూ మాటల దాడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు నిర్వహకులపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ అవార్డు కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతం చూపించారని కంగనా మండిపడింది. కాగా చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహేబ్‌ ఫాల్కే’ అవార్డు ఒకటి.

చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్‌ చేసిన నటి

నిన్న (సోమవారం) రాత్రి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. 2023కి గానూ పలువురు సినీ తారల సమక్షంలో దాదా సాహేబ్‌ ఫాల్కే ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌(బ్రహ్మాస్త్ర) ఉత్తమ నటిగా ఆలియా భట్‌(గంగూబాయ్‌ కథియవాడి) చిత్రాలకు గానూ అవార్డును అందుకున్నారు. అలాగే కాంతార మూవీ హీరో రిషబ్‌ శెట్టికి మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌గా ఈ అవార్డును దక్కింది.

చదవండి: నెపోటిజంపై నాని షాకింగ్‌ కామెంట్స్‌.. రానా రియాక్షన్‌ ఎంటంటే!

ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, ఫిలిం ఆఫ్‌ ది ఇయర్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలు అవార్డును గెలుచుకున్నాయి. అయితే రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాలకు ఈ అవార్డు రావడంపై కంగనా తప్పుబట్టింది. నెపోటిజం వల్లే అలియా భట్, రణబీర్ కపూర్‌కు అవార్డులు దక్కాయని విమర్శించింది. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ తన ట్విటర్‌లో ఓ జాబితాను పంచుకుంది. అనంతరం బాలీవుడ్‌ను నెపోటిజం వదలడంలేదని, అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కంగనా పేర్కొన్నా జాబితా ఇలా ఉంది

  • బెస్ట్ యాక్టర్ అవార్డు రిషబ్ శెట్టి (కాంతార)
  • బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు మృణాల్ ఠాకూర్ (సీతారామం)
  • ఉత్తమ చిత్రం అవార్డు కాంతారా
  • ఉత్తమ దర్శకుడు అవార్డు ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్ (కశ్మీరీ ఫైల్స్)
  • ఉత్తమ సహాయ నటి టబు (భూల్ భులయ్యా)   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు