Kareena Kapoor: కరీనా కపూర్‌ మళ్లీ ప్రెగ్నెంట్ !.. దాని వల్లే అని ఆసక్తికర పోస్ట్‌

20 Jul, 2022 08:23 IST|Sakshi

Kareena Kapoor Denies Pregnancy Rumours: బాలీవుడ్ దివా కరీనా కపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన బ్యూటీ కరీనా. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో కరీనా కపూర్‌కు 2012 అక్టోబర్‌ 16న ముంబైలోని బాంద్రాలో వివాహమైన విషయం తెలిసిందే. కరీనా-సైఫ్‌ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్‌ అలీ ఖాన్ (జేహ్‌) ఇద్దరు కుమారులు. అయితే తాజాగా కరీనా కపూర్ మరోసారి ప్రెగ్నెంట్‌ అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన కరీనా ఆసక్తికరమైన పోస్ట్‌తో సమాధానమిచ్చింది. 

ప్రస్తుతం సైఫ్‌, ఇద్దరి పిల్లలతో వెకేషన్‌లో ఉంది కరీనా. ఈ వెకెషన్‌కు సంబంధించిన ఒక ఫొటోను ఇటీవల పోస్ట్‌ చేసింది. ఆమె పోస్ట్‌ చేసిన అతికొద్ది సమయంలోనే ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అయింది. అందుకు కారణం ఆ ఫొటోలో కరీనా పొట్ట కొంచెం ఉబ్బుగా కనిపించడమే. దీంతో కరీనా మళ్లీ గర్భవతి అయిందని పుకార్లు చెలరేగాయి. ఈ వార్తలపై కరీనా స్పందిస్తూ 'ఇది కేవలం పాస్తా, వైన్‌ వల్లే. ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు. నేను గర్భవతిని కాదు. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాను అని సైఫ్‌ చెప్పాడు' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. దీంతో కరీనా ప్రెగ్నెంట్‌ రూమర్స్‌కు చెక్‌ పడినట్లయింది. కాగా కరీనా కపూర్‌ తాజాగా అమీర్ ఖాన్‌ 'లాల్‌ సింగ్ చద్దా' సినిమాలో 'రూప'గా నటించిన విషయం తెలిసిందే. 

చదవండి: చిక్కుల్లో సింగర్‌ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక
సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..
అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..

చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్‌ తమ్ముడు

మరిన్ని వార్తలు