స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం

18 Oct, 2023 16:07 IST|Sakshi

యంగ్ హీరో కార్తీ చేస్తున్న కొత్త సినిమా 'జపాన్‌'. ఇది కార్తీ 25వ మూవీ. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి థియేటర్లలోకి రానుంది. ఇక సినిమా రిలీజ్ త్వరలో ఉన్నందున ఆయన అఖిల భారత అభిమాన సంక్షేమ సంఘం.. కార్తీ నిర్వహిస్తున్న ఉళవన్‌ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 25 రోజులపాటు 25 వేల మందికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమైపోయారు. 

(ఇదీ చదవండి: హీరో ప్రభాస్‌ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

అన్నదానం కార్యక్రమానికి మంగళవారం ఉదయం స్థానిక టీ.నగర్‌ లోని కార్తీ అభిమాన సంఘం కార్యాలయంలో శ్రీకారం చుట్టారు. 'జపాన్‌' చిత్ర నిర్మాత ఎస్‌ ఆర్‌.ప్రభు, దర్శకుడు రాజు మురుగన్‌ విచ్చేసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25 వేల మందికి ఒకేసారి అన్నదానం చేయడం కంటే 25 రోజులు చైన్నెలోని ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడం మంచిదని భావించినట్లు అభిమాన సంఘ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?)

మరిన్ని వార్తలు