Rules Ranjan: ట్రోల్స్‌ పట్టించుకోను.. సంవత్సరం టైమ్‌ ఇవ్వండి: కిరణ్‌ అబ్బవరం

1 Oct, 2023 07:20 IST|Sakshi

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్‌ అబ్బవరం మొదటి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమా విజయంతో వరుస ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి. అలా ఆయన ఎస్‌. ఆర్‌. కల్యాణ మండపం, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మినిమమ్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా తర్వాత ఆయనకు అనుకున్నంత హిట్‌ ఇప్పటి వరకు రాలేదు. దీంతో కిరణ్‌పై పలు ట్రోల్స్‌ వచ్చాయి.  తాజాగా కిరణ్‌ నటించిన ‘రూల్స్‌ రంజన్‌’ అక్టోబర్‌ 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో తన కెరీర్‌, ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌పై మాట్లాడారు.

'చాలా మంది నాపై ట్రోల్స్‌ చేశారు. గత మూడు సంవత్సరాలుగా నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో నా ఫ్యాన్స్‌ ఎంతో అండగా నిలబడ్డారు. గొప్ప సినిమాలు తీయాలని నాకు ఉంది. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఈ మధ్య కాలంలో అంత మంచి సినిమాలను అందించలేకపోయాను. ఒక సంవత్సరం సమయం ఇవ్వండి మిమ్మల్ని (ఫ్యాన్స్‌) గొప్ప స్థానంలో నిలబెడుతాను. సరైన విజయం సాధించి అందరినీ గర్వపడేలా చేస్తాను. సినిమాపై ట్రోల్స్‌,రివ్యూలు రావడం సహజం.

(ఇదీ చదవండి: శివాజీ తిక్క కుదిర్చిన బిగ్‌బాస్.. ఇచ్చింది లాగేసుకున్నాడు!)

ఒక్కోసారి అది సినిమాపై ప్రభావం కూడా చూపుతుంది. వ్యక్తిగతంగా పట్టించుకోకపోయినా సినిమాపై ప్రభావండ పడకూడదని నేనే కోరుకుంటాను. ఇకపై ట్రోల్స్ గురించి పట్టించుకోను. ప్రశంసలు, విమర్శలు అనేది చలనచిత్ర సెలబ్రిటీ జీవితంలో ఒక భాగం.' అని ఆయన అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.  ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది.

మరిన్ని వార్తలు