ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా దివ్య

18 Jun, 2022 13:22 IST|Sakshi
దివ్య చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా రూపొందుతున్న చిత్రం దివ్య. నియాన్‌ సీ ఫిలి మ్స్‌ పతాకంపై శ్రీజేష్‌ వల్సన్‌ నిర్మిస్తున్న ఈ చి తం ద్వారా సనీఫ్‌ సుకుమారన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సాశ్వీబాలా, మిథున్, సంపత్‌ రామ్, మ్యాథ్యూస్‌ వర్గీస్, ప్రవీణ్, అఖిల్‌ కృష్ణజిత్, మురుగన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విపిన్‌రాజ్‌ చాయాగ్రహణం, రెజీమోన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు. తమిళంలో ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలు అరుదుగానే వస్తున్నాయని, ఆ కోవలో మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగే చిత్రంగా దివ్య ఉంటుందన్నారు. కొత్త ప్రదేశాలను సందర్శించాలి, కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవాలని భావించే ఒక యువతి తన బాయ్‌ ఫ్రెండ్‌తో పరిచయం లేని ప్రాంతానికి వెళ్లగా ఎలాంటి సంఘటన ఎదురైంది? అది ఏంటి? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

చదవండి: Raksha Bandhan Vs Laal Singh Chaddha: ఆమిర్‌తో పోటీపడుతున్న అక్షయ్‌.. పెద్ద సాహసమే!

మరిన్ని వార్తలు