సక్సెస్‌ కోసం అమ్మ పేరు మార్చుకోలేం కదా?: కోమ‌లీ ప్ర‌సాద్‌ | Sakshi
Sakshi News home page

Komalee Prasad: నా లవ్ బ్రేకప్ అయింది.. డేటింగ్‌ అంటే నచ్చదు.. అలాంటి వాడు కావాలి

Published Thu, Mar 21 2024 3:54 PM

Komalee Prasad Interesting Comments On Telugu Heroines At Shashivadane Movie Press Meet - Sakshi

ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మారి తమదైన నటనతో ఆకట్టుకునేవారు. కానీ ఆ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు కొద్దిమంది తెలుగమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కోమ‌లీ ప్ర‌సాద్‌ ఒకరు. ‘నేను సీతాదేవి’(2016) అనే చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నెపోలియన్‌’, ‘సెబాస్టియన్‌ పిసి524’,  ‘రౌడీ బాయ్స్‌’ సినిమాల్లోనూ చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.‘హిట్‌– 2’ చిత్రం కోమలి ఖాతాలో హిట్‌ పడింది. ఆర్వాత వరుస అవకాశాలలో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘శశివదనే’. పలాస 1978' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తూ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు మేకర్స్‌. ఈ సందర్భంగా కోమలీ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మన దర్శకనిర్మాతలు టాలెంట్‌ ఉన్న తెలుగమ్మాయిల కోసం వెతుకున్నారని.. అవకాశం ఉన్న ప్రతి సినిమాలోనూ ఇక్కడి అమ్మాయిలనే హీరోయిన్లుగా నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 

ఇంకా కోమలి మాట్లాడుతూ.. ‘ నేను ఓ తమిళ సినిమా కోసం 20 రోజుల పాటు వర్క్‌ షాప్‌ చేశాను. ప్రతి రోజు ఉదయం 7 గంటలకే లేచి..వ్యాయామం చేసుకొని..10 గంటలకల్లా ఆఫీస్‌కి వెళ్లేదాన్ని. అక్కడ యాక్టింగ్‌ ట్రైనర్‌ చెప్పినట్లుగా నటించేదాన్ని. 20 రోజుల్లో తమిళం కూడా నేర్చుకున్నాను. కానీ అక్కడి వారి నుంచి ఎలాంటి ప్రశంసలు రాలేదు. చివరి రోజు మాత్రం ‘తెలుగు వాళ్ల డెడికేషన్‌ ఇలా ఉంటుంది’ అని యాక్టింగ్‌ ట్రైనర్‌ అన్నారు.

మన వాళ్లపై తమిళ్‌లో అలాంటి నమ్మకం ఉంది. నేను టాలీవుడ్‌కి వచ్చిన తొలినాళ్లలో ..‘నువ్వు ముంబై నుంచి వచ్చావు కదా?  నువ్వు తెలుగమ్మాయి అని ఎక్కడా చెప్పకండి. అవకాశాలు రావు. ముంబై అమ్మాయినే అని చెప్పండి’ అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నేను తొలి నుంచి తెలుగమ్మాయిని అనే చెప్పుకున్నాను. నాకు వచ్చిన ప్రతి అవకాశం కూడా తెలుగమ్మాయిని అనే వచ్చింది. ఏదో సక్సెస్‌ అవ్వాలని అమ్మ పేరు మార్చుకోలేం కదా? నేను కూడా తెలుగమ్మాయిని..అలానే చెపుకుంటాను. ఇకపై కూడా అలానే ఉంటాను.

తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో చాన్స్‌లు ఇవ్వరనేది పచ్చి అబద్దం. అది బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే.. ఇండస్ట్రీలో అలా లేదు. ప్రతి డైరెక్టర్‌, నిర్మాత.. తెలుగమ్మాయి అయితే బాగుంటందని ఆలోచిస్తారు. అలాంటి పుకార్లు ఇకనుంచైనా ఆగిపోతే బాగుంటుంది’ అని కోమలి అన్నారు.  ఇక తన లవ్‌స్టోరీ గురించి చెబుతూ.. ‘అందరిలాగానే నేను కూడా ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ అయింది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. డేటింగ్‌ అంటే నాకు నచ్చదు. పద్దతిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రోజుకు రెండు జోకులు..ఒక పూట బిర్యానీ తినిపించేవాడు దొరికితే చాలు పెళ్లి చేసుకుంటా (నవ్వుతూ) చెప్పింది ఈ తెలుగు బ్యూటీ. 

Advertisement
Advertisement