List of Upcoming Movies Web Series Theatres and OTT May 4th Week - Sakshi
Sakshi News home page

Upcoming Movies: మే నాలుగో వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలివే!

Published Mon, May 23 2022 10:58 AM

List of Upcoming Movies Web Series Theatres and OTT May 4th Week - Sakshi

ఇప్పటిదాకా భారీ బడ్జెట్‌ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. మధ్యమధ్యలో కొన్ని చిన్న సినిమాలు కూడా ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టాయి. అయితే ఈ వారం మాత్రం ప్రేక్షకుడికి వినోదాన్ని పంచేందుకు ఓ మల్టీస్టారర్‌ మూవీ సిద్ధమైంది. ఇప్పటిదాకా కమర్షియల్‌ సినిమాలు చూసిన ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించేందుకు వస్తోంది ఎఫ్‌ 3. ఈ వారం థియేటర్‌లో రిలీజ్‌ అవుతున్న పెద్ద సినిమా ఇదొక్కటే ఉంది. అటు ఓటీటీ కూడా ఈ వారం సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు సై అంటోంది. మరి ఈ వారం అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేయండి..

ఎఫ్‌ 3
వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్‌ 3. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. సోనాల్‌ చౌహాన్‌, సునీల్‌, రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 27న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. మరి సమ్మర్‌ సోగ్గాళ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారో లేదో చూడాలి. 

అశోకవనంలో అర్జున కల్యాణం
మాస్‌ సినిమాలతో ఫాలోయింగ్‌ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ అశోకవనంలో అర్జున కల్యాణం. ఇందులో విశ్వక్‌ అద్భుతమైన నటన కనబర్చాడు. రుక్సార్‌ ధిల్లాన్‌ కథానాయికగా ఆకట్టుకుంది. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోనే ఓటీటీ బాట పట్టిన ఈ చిత్రం ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కణ్మణి రాంబో ఖతీజా
విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రల్లో నటించిన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ కాతువాకుల రెండు కాదల్‌. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా విడుదలైంది. తాజాగా ఓటీటీ ట్రాక్‌ ఎక్కిన ఈ మూవీ మే 27 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

అటాక్‌
జాన్‌ అబ్రహం హీరోగా నటించిన మూవీ అటాక్‌: పార్ట్‌ 1. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. జీ 5లో మే 27 నుంచి అందుబాటులోకి రానుంది.

ఓటీటీలో ఇంకా ఏమేం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయంటే..
హాట్‌స్టార్‌
ఒబీ వ్యాన్‌ కెనోబి (వెబ్‌ సిరీస్‌) - మే 27

నెట్‌ఫ్లిక్స్‌
తులసీదాస్‌ జూనియర్‌ - మే 23
వెల్‌కమ్‌ టు వెడ్డింగ్‌ హెల్‌ - మే 23
స్ట్రేంజర్‌ థింగ్స్‌ (నాలుగో సీజన్‌) - మే 27

సోనీ లివ్‌
నిర్మల్‌ పాఠక్‌ కీ ఘర్‌ వాపసీ (వెబ్‌ సిరీస్‌) - మే 27
సేత్తుమాన్‌ - మే 27

చదవండి 👇
'ప్లాస్టిక్‌ సర్జరీలు చేసుకుని ఐశ్వర్యరాయ్‌ చివరకు ఇలా తయారైంది'
బెడ్‌ సీన్‌ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్‌ రిప్లై

Advertisement
Advertisement