ఏవో ఏవో కలలే...

26 Mar, 2021 00:50 IST|Sakshi

‘ఏవో ఏవో కలలే, ఎన్నో ఎన్నో తెరలే, అన్నీ దాటి మనసే ఎగిరిందే...’ అంటూ ఆడి పాడారు నాగచైతన్య, సాయిపల్లవి. ఈ ఇద్దరూ జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్‌ స్టోరి’. కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌  రావు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘ఏవో ఏవో కలలే..’ అంటూ సాగే పాటను హీరో మహేశ్‌బాబు ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌  స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్‌ సాహిత్యం అందించారు. జోనితా గాంధీ, నకుల్‌ అభ్యంకర్‌ పాడారు. ‘‘భాస్కరభట్లతో పరిచయం ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ఉంది. ఈ పాటను అద్భుతంగా రాసినందుకు థ్యాంక్స్‌’’ అని శేఖర్‌ కమ్ముల ట్వీట్‌ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ సి.కుమార్, సహ నిర్మాత: భాస్కర్‌ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఐర్ల నాగేశ్వర రావు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు