అనుమానాల నివృత్తికే సీసీ ఫుటేజీ పరిశీలన: ప్రకాశ్‌రాజ్‌ 

19 Oct, 2021 04:37 IST|Sakshi

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించడమే కాకుండా సోమవారం ‘మా’ఎన్నికల పోలింగ్‌ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసుల సమక్షంలో పరిశీలించారు. ఈ మేరకు తన ప్యానెల్‌ సభ్యులైన శ్రీకాంత్, బెనర్జీ, తనీష్‌తో కలిసి ఉదయం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చేరుకొని బంజారాహిల్స్‌ ఏసీపీ ఎం.సుదర్శన్, ఇన్‌స్పెక్టర్‌ రాజ శేఖర్‌రెడ్డి, సెక్టార్‌ ఎస్‌ఐ శివశంకర్‌తో కలిసి  ఫుటేజీని వీక్షించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసమే పోలింగ్‌ సెంటర్‌లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించామన్నారు. ఎన్నికల అధికారి వద్ద మరో ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజీ ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. తమకు కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌తోనే ఇబ్బందులున్నాయని ఆరోపించారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు