ఆకట్టుకుంటున్న మహేశ్‌ తాజా లుక్‌, ఫొటో వైరల్‌

8 Aug, 2021 19:08 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రేపటితో 45 వసంతాలను పూర్తి చేసుకోబోతున్నాడు. రేపు(ఆగస్ట్‌ 9న) ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయి.  10 రోజుల నుంచే అభిమానులు ‘సూపర్‌ స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మహేశ్‌కు సంబంధించిన ఓ తాజా లుక్‌ విడుదలైంది. ఇందులో ఆయన ఫార్మల్‌ షర్ట్‌, ప్యాంటు ధరించి స్టైలిష్‌గా మరింత యంగ్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ లుక్‌ ఆయన అభిమానులు, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  

ఇక దక్షిణాదిలోనే మొట్టమొదటి సారిగా మహేశ్‌ పేరుతో అతిపెద్ద సెలబ్రెటీ ట్విట్టర్‌ స్పెస్‌ను నిర్వహించాలని ఆయన టీం ప్లాన్‌ చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమకు చెందిన మహేశ్‌ సన్నిహితులు ఆయన సినిమాల విజయాలపై, ఇతర విశేషాలపై చర్చిస్తారు. అంతేగాక రేపు ఉదయం 9:09 గంటలకు ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్‌ రానుంది. దీనితో పాటు ఆయన తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా బయటకు రానున్నాయి. దీంతో ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో బర్త్‌డే బ్లాస్టర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేశ్‌ సరసన కీర్తి సూరేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు