రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా? | Mahesh Babu Is Not Charging Remuneration For Rajamouli Movie: Report - Sakshi
Sakshi News home page

Mahesh Babu: రాజమౌళితో పాన్ ఇండియా సినిమా.. మహేశ్‌ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదా?

Published Sun, Jan 28 2024 10:40 AM

Mahesh Babu No Remuneration For Rajamouli Movie - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్ బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. అవును మీరు సరిగానే విన్నారు. ఇప్పటివరకు ప్రతి సినిమాకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరో.. రాజమౌళితో చేయబోయే మూవీ కోసం మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? కారణమేంటి?

మహేశ్-రాజమౌళి సినిమా చేయబోతున్నారు. ఇది అందరికీ తెలుసు. 'ఆర్ఆర్ఆర్' మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే రాజమౌళి, ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించాడు. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజులో ఇది ఉండదని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయినట్లు రైటప్ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఉగాదికి సినిమాని లాంఛనంగా ప్రారంభించే అవకాశముండొచ్చు.

(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)

ఈ ఏడాది మొదలు కావడమైతే పక్కా కానీ ఎప్పుడనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని దాదాపు రూ.1000 కోట్ల బడ్డెట్‌తో నిర్మించనున్నారనే రూమర్స్ గట్టిగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో క్రేజీ విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం మహేశ్.. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాడట. అలా అని ఫ్రీగా చేస్తాడని కాదు. రిలీజ్ తర్వాత లాభాల్లో షేర్ ఉంటుందట. 

రీసెంట్‌గా 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల్ని పలకరించిన మహేశ్.. ఒక్కో సినిమాకు రూ.60-70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్. రాజమౌళితో మూవీ కోసం రూ.110 కోట్లు రెమ్యునరేషన్ అని అప్పట్లో టాక్ నడిచింది. ఇప్పుడు ప్లాన్ మారిపోయిందని.. రాజమౌళి-మహేశ్ ఇద్దరూ కూడా లాభాల్లో వాటా తీసుకుంటారని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. అందుకే ఇలా కనిపించిందా?)

Advertisement
Advertisement