హైదరబాద్‌లో పుష్ప టీం, షూటింగ్‌లో పాల్గొన్న పుష్పరాజ్‌

6 Jul, 2021 22:28 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవల కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడమే కాకుండా ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో పుష్ప టీం హైదరాబాద్‌లో షూటింగ్‌ను ప్రారంభించినట్లు తాజాగా మేకర్స్‌ తెలిపారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ ప్రారంభం అయ్యిందని, అల్లు అర్జున్, ర‌ష్మిక ఇత‌ర తార‌ల‌పై కీలక స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నట్లు మేకర్స్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా పుష్ప మూవీలో నటుడు సునీల్‌ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీలో మెయిన్‌ విలన్‌గా మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.  పుష్పను రెండు భాగాల్లో విడుదల విడుదదల కానుంది. ఇందులో బన్ని పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో అభిమానులను అలరించనుండగా రష్మిక విలేజీ నేపథ్యం ఉన్న అమ్మాయిగా నటిస్తోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు