Actor Shiyas Kareem Arrest: పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అరెస్ట్!

5 Oct, 2023 18:17 IST|Sakshi

ప్రముఖ మలయాళ నటుడు షియాస్‌ కరీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న మహిళ ఫిర్యాదుతో అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మంచి మోసం చేశాడంటూ 32 ఏళ్ల మహిళ గత నెలలో కాసర్‌గోడ్‌లోని చందేరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం చెన్నైలో దిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. అతనిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

(ఇది చదవండి: విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ మూవీ.. రిలీజ్‌ డేట్‌పై అప్‌డేట్‌!)

కరీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జిమ్‌లోనే ఆ మహిళా జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తోంది. తన వద్ద నుంచి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడని.. డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి 2021 ఏప్రిల్‌ నుంచి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తానని చెప్పి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో కరీమ్‌ను అదుపులోకి తీసుకు‍న్న ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు చందేరా పోలీసులకు అప్పగించనున్నారు. కాగా.. కరీం గతంలో ఆమె చేసిన ఆరోపణలను కల్పితమని కొట్టి పారేశాడు. కాగా.. కరీం మలయాళంలో పలు చిత్రాల్లో నటించారు.  అంతే కాకుండా మలయాళం బిగ్‌ బాస్‌ షోతో ఫేమ్ తెచ్చుకున్నారు. 

A post shared by Shiyas Kareem (@shiyaskareem)

మరిన్ని వార్తలు