మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్‌.. ఆందోళన అక్కర్లేదంటూ ఎమోషనల్‌ ట్వీట్‌

29 Dec, 2021 12:29 IST|Sakshi

కరోనా మహహ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు వరుసగా కోవిడ్‌ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్‌ హాసన్‌, అర్జున్‌, బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

తాజాగా టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్‌ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, న‌ర్సులంద‌రికీ నేను ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను’అని మనోజ్‌ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు