Manjima Mohan: హీరోతో ప్రేమలో పడిపోయా.. హీరోయిన్‌ పోస్ట్‌ వైరల్‌

31 Oct, 2022 20:46 IST|Sakshi

కోలీవుడ్‌ హీరో గౌతమ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ మంజిమా మోహన్‌ మధ్య కుచ్‌కుచ్‌ హోతాహై అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఈ వార్తలపై స్పందించిన మంజిమా.. అతడి ప్రేమను అంగీకరించలేదని తెలిపింది. ఒకవేళ నిజంగా లవ్‌లో పడితే కచ్చితంగా అందరికీ చెప్తానంది. అయితే ఇన్నాళ్లకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందీ ఈ ముద్దుగుమ్మ. 

సోషల్‌ మీడియా వేదికగా కార్తీక్‌తో లవ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 'మూడేళ్ల క్రితం నా జీవితంలో అడుగు పెట్టావు. లైఫ్‌ను ఎలా చూడాలో నేర్పించావు. దిక్కుతోచని పరిస్థితులెదురైన ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకువచ్చావు. నాలా నేను ఉండాలని నేర్పించావు. నా మీద ఎంతో ప్రేమ కురిపించావు, అందుకే నీతో లవ్‌లో పడిపోయాను. నువ్వు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే' అని రాసుకొచ్చింది. అటు గౌతమ్‌ కూడా తమ స్నేహం గాఢమైన ప్రేమగా మారినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట షేర్‌ చేయగా అవి వైరల్‌గా మారాయి.

కాగా అలనాటి హీరో నవరస నయగన్‌ కార్తీక్‌ తనయుడే గౌతమ్‌ కార్తీక్‌. ప్రస్తుతం గౌతమ్‌ కోలీవుడ్‌లో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమా మోహన్‌ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. ఆ మధ్య ఎఫ్‌ఐఆర్‌ సినిమాతోనూ ఆకట్టుకుంది. గౌతమ్‌, మంజిమ ఇద్దరూ దేవరత్తమ్‌ సినిమాలో కలిసి నటించారు.

A post shared by Manjima Mohan (@manjimamohan)

A post shared by Gautham Karthik (@gauthamramkarthik)

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
కాంతారలో ఏముందని ఎగబడుతున్నారు

మరిన్ని వార్తలు