చిరంజీవి కెరీర్‌లో స్పెషల్‌.. 45 ఏళ్ల సినీ ప్రస్థానానికి ఆ సినిమానే నాంది | Sakshi
Sakshi News home page

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి 45 ఏళ్ల సినీ ప్రస్థానం.. రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Fri, Sep 22 2023 6:25 PM

Megastar Chiranjeevi Has 45 Years Of Cinema Journey Completed - Sakshi

చిరంజీవి ఇండియన్‌ సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. 1978 సెప్టెంబర్‌ 22న మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన టాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ హీరోగా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి ఎందరో హేమా హేమీల్లాంటి నటులున్న తెలుగు చిత్ర పరిశ్రమలోకి శివ శంకర వరప్రసాద్‌ (చిరంజీవి అసలు పేరు) ప్రవేశించారు. అలా ఆయన ఒక్క మెట్టు ఎక్కుతూ తెలుగు చిత్ర సీమలో ఎన్నో సంచలనాలు క్రియేట్‌ చేశారు.

(ఇదీ చదవండి: ఇదీ నీచమైన చర్య: సాయిపల్లవి)

సెప్టెంబరు 22 చిరంజీవి కెరీర్‌లో అరుదైన, ఎప్పటికీ గుర్తిండిపోయే రోజు. ఆయన ఫ్యాన్స్‌కు పండుగ రోజు కూడా.. ఆయన కీలక పాత్రలో నటించిన 'ప్రాణం ఖరీదు' విడుదలై నేటికి 45ఏళ్లు పూర్తి అయింది. ఆయన జీవితంలో ఆగస్టు 22కి ఎంతో ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబరు 22కి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 22న ఆయన మనిషిగా ప్రాణం పోసుకున్న రోజు అయితే, సెప్టెంబరు 22 నటుడిగా 'ప్రాణం(ఖరీదు)' పోసుకున్న రోజు అని తెలిసిందే. మెగాస్టార్‌ 45 ఏళ్ల సినీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఒక పోస్ట్‌ చేశారు.

'మన ప్రియతమ మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు. సినిమాల్లో 45 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్న ఆయన అందరినీ మెప్పించే నటనతో ఇప్పటి వరకు కొనసాగారు.. కొనసాగుతున్నారు కూడా. మీరు మీ ఆన్ స్క్రీన్ ప్రదర్శనలతో పాటు మీ ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యకలాపాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం, శ్రేష్ఠతతో పాటు అన్నింటికంటే ముఖ్యంగా కరుణ వంటి విలువలను మాలో పెంపొందించినందుకు నాన్నగారికి ధన్యవాదాలు అంటూ..' ఆయన తెలిపారు.

1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు మొదటి సినిమాగా విడుదల కాగా.. ఇప్పటికీ 150కి పైగా చిత్రాల్లో నటించి ఎవరూ బీట్‌ చేయలేని పలు రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తన కుమార్తె సుష్మిత నిర్మాణంలో ఆయన 156వ సినిమా చేయనున్నారు. మరోపక్క వశిష్ట డైరెక్షన్లో కూడా మెగా 157 సినిమా చేయనున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్నాయి.

Advertisement
Advertisement