మెగాస్టార్‌ చిరంజీవి వాచ్‌ ధర ఎంతో తెలుసా..? | Megastar Chiranjeevi Watch Cost Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి వాచ్‌ ధర తెలిస్తే.. ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే

Published Fri, Sep 1 2023 9:57 AM

Megastar Chiranjeevi Watch Cost Viral - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్‌కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. టాలీవుడ్‌ ఎంతో మంది స్టార్స్‌ రాఖీ పండుగ సెలబ్రెట్‌ చేసుకుంటారు. కానీ చిరంజీవి ప్రతి సంవత్సరం చెల్లెల్లతో చేసుకునే రాఖీ పండుగను ఆయన అభిమానులుచూడాలని కోరుకుంటారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్‌ చేస్తూ వస్తుంటారు కూడా. మెగాస్టార్‌ తండ్రి వెంకటరావు, మామ అల్లు రామలింగయ్య ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా ఆయన పూజిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

(ఇదీ చదవండి: 'జైలర్‌'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్‌ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?)

ఆ ఫోటోలతో పాటు చిరు చేతికి ఉన్న వాచ్‌ కూడా ఇప్పుడు వైరల్‌ అయింది. ఆయన చేతికి ఉన్న వాచ్‌ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్, సహజంగా దాని ధర కూడా భారీగానే ఉంటుంది. దీంతో ఆయన అభిమానులు ఆ వాచ్‌ ధర ఎంతో తెలుసుకోవాలని ఆన్‌లైన్‌లో సర్చ్‌ చేశారు.  దాని ధర రూ. 2.35 లక్షల డాలర్లు అని ఉంది. అదే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం చూస్తే  సుమారు రూ. 2 కోట్లు. ఆ వాచ్‌ ధర చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు.  తనకు కార్ల కంటే కొత్త కొత్త వాచీలు కొనడం అంటేనే ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో చిరు చెప్పిన విషయం తెలిసిందే. అందుకే ఆయన వద్ద భారీగానే వాచ్‌ కలెక్షన్స్‌ ఉన్న విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్‌ న్యూస్‌.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్‌ విడుదల)

ఎవరి గురించి అయినా ఇలాంటి విషయాలు వైరల్‌ అయినప్పుడు పలురకాల కామెంట్లు చేయడం సహజం.. కానీ చిరంజీవికి ఈ సంపద ఒక్కరోజులో వచ్చింది కాదు.. కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కుతూ సంపాధించుకున్నారు. దీంతో ముచ్చటపడి కొనుకుంటే తప్పేంటని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, మహేశ్‌ బాబు ఇలా ఎందరో సెలబ్రిటీలు ధరించిన వస్తువుల ధరలపై పలు వార్తలు అప్పడప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి.  ఈ మధ్య సినీ, వ్యాపార సెలబ్రిటీలు ధరించే వస్తువుల మీద నెటిజన్లు కూడా ఒక లుక్‌ వేస్తూ.. వాటి ధరలు తెలుసుకుందామనే ఆసక్తి కూడా ఎక్కవేనని చెప్పవచ్చు.

Advertisement
Advertisement