చిరంజీవి సర్జా తొలి వర్థంతి, మేఘన ఎమోషనల్‌

7 Jun, 2021 15:04 IST|Sakshi

కన్నడ స్టార్‌ హీరో, దివంగత నటుడు చిరంజీవి సర్జా మృతి చెంది నేటికి ఏడాది. గతేడాది జూన్‌ 7వ తేదీన చిరు సర్జా గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం(జూన్‌ 7) ఆయన మొదటి వర్థంతి సందర్భంగా ఆయన భార్య, నటి మేఘనా రాజ్‌ ఓ పోస్టు షేర్‌ చేశారు. చిరు, మేఘనాలు మాట్లాడుకుంటుండగా ప్రేమతో ఆమెను చూస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీనికి మేఘన ‘మన ప్రేమ నాది’ అంటు ఎమోషనల్‌ క్యాప్షన్‌తో హార్ట్‌ ఎమోజీని జోడించి అభిమానులను, నెటిజన్లను కదిలించారు. తన పోస్టుపై ప్రముఖ నటి, మేఘన స్నేహితురాలు నజ్రీయా నజీంతో పాటు పలువురు నటీనటులు  స్పందించారు. 

కాగా చిరంజీవి సర్జా మృతి చెందే సమయానికి మేఘన అయిదు నెలల గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో జూనియర్‌ సర్జాకు ఆమె జన్మనిచ్చింది. అప్పటి నుంచి అతడికి సంబంధించిన ప్రతి వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేస్తున్నారు. అంతేగాక చిరు సర్జాతో తనకున్న జ్ఞాపకాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనవుతున్నారు.

A post shared by Meghana Raj Sarja (@megsraj)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు