Meher Ramesh: 'భోళా శంకర్‌' దెబ్బతో రూట్‌ మార్చిన మెహర్‌ రమేష్‌

14 Sep, 2023 08:58 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్‌ సినిమా తీసిన మెహ‌ర్ ర‌మేష్‌ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. దీనికి ప్రధాన కారణం భోళా శంకర్‌ డిజాస్టర్‌ కావడమే.. మెహర్‌ రమేష్‌తో సినిమా అనగానే మొదట్లో మెగా ఫ్యాన్స్‌  బెంబేలెత్తిపోయారు. వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే సినిమా తీసి చిరంజీవి కెరియర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌ను మిగిల్చాడు. శ‌క్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్ట‌ర్లు తీసి ఏడెనిమిదేళ్లుగా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉన్న ద‌ర్శ‌కుడికి చిరంజీవి అవ‌కాశం ఇవ్వ‌డ‌మేంట‌నే అందరిలోనూ ఈ ప్ర‌శ్న కలిగింది. కానీ ఇవన్నీ పక్కనబెట్టి చిరంజీవి లాంటి స్టార్‌ హీరో అవకాశం ఇస్తే.. పరమ చెత్తగా సినిమా తీశాడనే అపవాదును మెహర్‌ రమేష్‌  తెచ్చుకున్నాడు.

(ఇదీ చదవండి: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్‌బాస్‌ బ్యూటీ)

భోళా శంకర్‌ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెహర్ రమేష్ కెరీర్ పతనమేనని... ఇక ఇండస్ట్రీలో తేరుకునే అవకాశమే లేదని వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడక్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యానర్‌ నుంచి  మెహర్‌ రమేష్‌కు ఆఫర్‌ వచ్చిందట.. తక్కువ బడ్జెట్‌లో ఒక మూవీ నిర్మించాలని కోరిందట. అది కూడా సుమారు రూ. 5 కోట్లలోపు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కండీషన్‌ పెట్టిందట.

(ఇదీ చదవండి: స్టార్‌ హీరో కుమారుడితో సాయి పల్లవి.. లైన్‌ క్లియర్‌)

దీంతో ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట. కొత్త వారితో సినిమా తీసి సూపర్‌ హిట్‌ కొట్టి మళ్లీ టాలీవుడ్‌ రేసులో నిలబడాలని పట్టుదలతో ఉన్నారట. భారీ బడ్జెట్‌లతో సినిమాలు తీసే ఆయన ఇలా తక్కవు ఖర్చుతో సినిమాను తీసేందుకు రూట్‌ మార్చినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో సినిమా ప్రకటన ఉంటుందని ఇండస్ట్రీలో టాక్‌.

మరిన్ని వార్తలు