‘దోస్తాన్’లుక్‌ బాగుంది.. హిట్‌ కావాలి: మంత్రి హరీశ్‌రావు | Sakshi
Sakshi News home page

‘దోస్తాన్’లుక్‌ బాగుంది.. హిట్‌ కావాలి: మంత్రి హరీశ్‌రావు

Published Tue, Oct 11 2022 5:43 PM

Minister Harish Rao Released First Look Poster Of Dhostan Movie - Sakshi

సిద్ స్వరూప్ , కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా తెరెకెక్కిన చిత్రం ‘దొస్తాన్‌’. శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ‘దోస్తాన్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని తీశారు అనిపిస్తుంది. మంచి కథను  సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘సిద్ స్వరూప్ అందించిన  కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మ. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం లో నటించే అవకాశం కల్పించిన  దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’అని హీరో సిద్‌ స్వరూప్‌ అన్నారు.

Advertisement
Advertisement