సంజూ‌ బాబా ఇంట్లో సూపర్ ‌‌స్టార్‌

15 Nov, 2020 08:51 IST|Sakshi

ముంబై: సినీ ప్రముఖలు  ఏ పండగైనా చాలా వైభవం‍గా జరుపుకుంటూ వాటికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. పలు సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండే సినీ సెలబ్రెటీలు  ఈ సారి కరోనా వైరస్‌ కారణంగా సినిమాలు ఏమి లేకపోవడంతో దీపావళీ పండగ వేడకను తమ ఇళ్లలో జరుపుకున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌, ఆయన భార్య మాన్యతా దత్‌ ముంబైలోని తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ పాల్గొన్నారు. సంప్రదాయమైన దుస్తులు ధరించి వారంతా ఫొటోలు దిగారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్‌లాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ‘సంజయ్‌, మాన్యతా నా స్నేహితులు’ అని కాప్షన్‌ జతచేశారు. 

ఈ ఫొటోల్లో సంజయ్‌ దత్త్‌, మోహన్‌లాల్ ఒకరికొకరు నమస్కరించుకొని పలకరించుకోవటం, సరదాగా మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సంజయ్‌ దత్‌ కన్నడ కేజీఎఫ్-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే మోహన్‌లాల్‌ దృశ్యం-2 రెండో విడత షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ కోసం మోహన్‌లాల్‌ దుబాయ్‌ వెళ్లిన విషయం తెలిసిందే.

A post shared by Mohanlal (@mohanlal)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు