Buzz: Mrunal Thakur To Play Lead Role In Raviteja And Gopichand Malineni Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Raviteja-Gopichand Malineni Movie: ఆ సూపర్‌ హిట్‌ కాంబినేషన్ ప్రాజెక్ట్‌లోకి మృణాల్‌ ఠాకూర్‌ ఎంట్రీ

Published Fri, Jul 28 2023 12:45 AM

Mrunal Thakur next movie with Ravi Teja - Sakshi

‘సీతారామం’తో బ్లాక్‌బస్టర్‌ హీరోయిన్‌గా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ ఠాకూర్‌ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్‌ నాన్న’, విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న  ‘ఫ్యామిలీ స్టార్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ బ్యూటీకి మరో ఆఫర్‌ వచ్చిందట.

‘డాన్  శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలోని హీరోయిన్  పాత్ర కోసం ముందు పూజా హెగ్డే పేరు వినిపించగా, తాజాగా మృణాళ్‌ ఠాకూర్‌ పేరు తెరపైకి వచ్చింది. మరి.. రవితేజ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపిస్తారా? లేక రవితేజతో మృణాల్‌ జోడీ కడతారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

Advertisement
Advertisement