రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌..

16 May, 2022 08:45 IST|Sakshi

Music Director D Imman Gets Married Again: కోలీవుడ్ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌లలో డి. ఇమాన్‌ ఒకరు. శతాధిక చిత్రాలకు సంగీతం అందిచారు ఇమాన్. తాజాగా ఆయన రెండో వివాహం చేసుకున్నారు. 2008లో కంప్యూటర్‌ ఇంజినీర్‌ మోనికా రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకున్నారు.  13 ఏళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా గతేడాది డిసెంబర్‌ 29న విడాకులు తీసుకుంటున్నట‍్లు ప్రకటించారు. తర్వాత తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్లి చేసుకుంటానని అప్పట్లోనే తెలిపారు ఇమాన్‌. ఇప్పుడు దానిని నిజం చేస్తూ రెండో వివాహం చేసుకున్నారు. 

దివంగత కళా దర్శకుడు ఉబాల్ట్‌ కుమార్తె అమేలీని రెండో పెళ్లి చేసుకున్నారు ఇమాన్. వీరి వివాహం ఆదివారం ఉదయం చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇమాన్‌ మ్యారేజ్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.  రజనీకాంత్‌ 'పెద్దన్న', అజిత్‌ 'విశ్వాసం', సూర్య 'ఎవరికీ తలవంచకు' సినిమాలకు డి. ఇమాన్‌ సంగీతం అందించారు. 

చదవండి: చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత
అక్షయ్, అజయ్‌పై కంగనా రనౌత్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

మరిన్ని వార్తలు