Shriya Saran: మ్యూజిక్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ తీసుకోనున్న హీరోయిన్‌!

2 Sep, 2021 03:59 IST|Sakshi

‘మ్యూజిక్‌ స్కూల్‌’లో అడ్మిషన్‌ తీసుకోనున్నారు శ్రియ. కానీ ఈ మ్యూజిక్‌ స్కూల్‌ సంగీతం నేర్చించే అకాడమీ కాదు. సంగీతం ద్వారా పిల్లల చదువుల గురించి చెప్పే ‘మ్యూజిక్‌ స్కూల్‌’  సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బాణీలు అందిస్తారు. ‘విల్లింగ్‌ టు శాక్రిఫైజ్‌’ డాక్యుమెంటరీతో జాతీయ స్థాయి అవార్డులు సాధించిన బియ్యాల పాపారావు దర్శకత్వంలో ఈ సినిమాను యామినీ ఫిలింస్‌ నిర్మించనుంది.

శర్మాన్‌ జోషి, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ బహు భాషా చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రధారులు. డాక్టర్లను, ఇంజినీర్లను చేయడానికి పిల్లలను క్రీడలకు, కళలకు దూరం చేస్తున్న అంశం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో దాదాపు పన్నెండు పాటలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు లండన్‌ బేస్డ్‌ సినిమాటోగ్రాఫర్‌ కిరణ్‌ దేవ్‌హాన్స్‌ (హిందీ చిత్రం ‘జోధాఅక్బర్‌’కు వర్క్‌ చేశారు) వర్క్‌ చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు