Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్‌కు రూ.700 కోట్ల విదేశీ పెట్టుబడులు.. ఆ దర్శకుడికి హవాలా ద్వారా రూ.150 కోట్లు!

25 Apr, 2023 21:15 IST|Sakshi

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెట్టుబడులపై ఆదాయపన్ను శాఖ   కీలక సమాచారం రాబట్టింది. మైత్రీ సంస్ద లోకి  రూ.700 కోట్ల విదేశి పెట్టుబడులు వచ్చినట్లు గుర్తించింది. ఇవి తొలుత ముంబై బేస్డ్ కంపెనీకి   బదిలీ అయినట్లుగా నిర్ధరించింది. 

ఆ తర్వాత ఈ డబ్బును ఏడు కంపెనీలకు తరలించినట్లు ఐటీ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. వాటి నుంచి మైత్రీకి పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు ఐడెంటిఫై చేసినట్లు పేర్కొన్నారు. హవాలా ద్వారా బాలీవుడ్  దర్శకుడికి మైత్రీ సంస్థ రూ.150కోట్ల చెల్లించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ సంస్థ తీస్తోన్న ఓ సీక్వెల్ మూవీలో హీరోకు సైతం హవాలా రూపంలోనే పేమెంట్స్ ఇచ్చినట్లు సమాచారం. 

మైత్రీ సంస్థ గత రెండేళ్లలో  ఇద్దరు  బడా హీరోలకు సైతం‌ అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే హీరోల  ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ హీరోలను విచారణ నిమిత్తం ముంబైకి  పిలిచే అవాకశం ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది.
చదవండి: రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ ఎవరంటే?

మరిన్ని వార్తలు