ఫోన్‌ కాల్‌ వస్తే నమ్మలేదు.. వీడియో కాల్‌ చేసి చెప్పారు: నాగ చైతన్య

10 Aug, 2022 17:39 IST|Sakshi

‘లాల్‌సింగ్‌ చడ్డా’నటించడానికి డేట్స్‌ ఖాలీగా ఉన్నాయా అని ఒకరు ఫోన్‌ కాల్‌ చేసి అడిగారు. ఆమిర్‌ ఖాన్‌ సినిమాలో నేను నటించడమేంటి? అది ఫేక్‌ కాల్‌ అని పట్టించుకోలేదు. కానీ తర్వాత ఆమిర్‌ ఖాన్‌, డైరెక్టర్‌ అద్వైత్ చందన్  వీడియో కాల్‌ చేసి మాట్లాడినప్పుడు ఎగ్జైటింగ్ అనిపించింది. బాలరాజు పాత్ర నచ్చి వెంటనే ఓకే చెప్పాను’అన్నారు యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య. ఆమిర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. ఈ చిత్రంలో  నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా వస్తున్న ‘లాల్‌సింగ్‌ చడ్డా’ ఆగస్ట్‌11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నాగచైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

ఈ చిత్రంలో నా పాత్ర పేరు బాలరాజు. దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న బాలరాజు క్యారెక్టర్ నాకు స్పెషల్ గా అనిపించింది. 1948 లో తాతగారు ఈ టైటిల్ పేరుతో నటించిన చిత్రం సూపర్ హిట్ అయ్యిందని. నాకు చాలా హ్యాపీ అనిపించడమే కాక బ్లెస్సింగ్స్  కూడా  ఉన్నట్టు అనిపించింది.

ఆమిర్‌ ఖాన్ లాంటి వారితో కలసి నటించడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఆయనతో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకొన్నాను. ఆయన ఆన్ సెట్ లో,ఆఫ్ సెట్ లో ఉన్నా కూడా ఒకేలా ఉంటారు. కెమెరా ఆఫ్ చేసినా  కూడా ఆయన పాత్ర నుంచి బయటకు రారు అంత  డెడికేటెడ్ గా ఉంటారు. కొన్ని సినిమాలు చేసిన తరువాత అందులో చేసిన ఎక్సపీరియన్స్ , మూమెంట్స్ లైఫ్ లాంగ్ మనకు నేర్పిస్తుంటాయి.  అలాంటిదే ఈ సినిమా. 

సినిమాలో లాల్ పాత్రలో నటించిన అమీర్ కు ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి చూపించకుండా అద్భుతంగా నటించాడు.  అమీర్ ఖాన్ గారు చాలా డిసిప్లేన్ పర్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి. తనతో నటించడం వలన తననుంచి  చాలా నేర్చుకున్నాను.అమీర్ లాంటి యాక్టర్ పక్కన చేయడం వలన చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. 

గుంటూరు జిల్లాలోని బోడిపాలెం దగ్గర పుట్టిన బాలరాజు  అర్మీ లో జాయిన్ అయిన విధానం ఇందులో చాలా చక్కగా చూపించడం జరుగుతుంది.ఇందులో తెలుగు నేటివిటీ చాలావరకూ కనిపిస్తుంది. ఈ సినిమాను తెలుగు జిల్లాలలో కూడా షూటింగ్ చేయడం  జరిగింది.

ఈ సినిమాని చిరంజీవి గారు పర్సనల్ గా తీసుకొని విడుదల చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని రివ్యూస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చడమే కాకుండా  చూసిన ప్రతి ఇండియన్ కూ రిలేట్ అవుతుంది.

‘వెంకీమామ’లో నేను ఆర్మీ క్యారెక్టర్ చేసినా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ చిత్రంలో కార్గిల్ లో జరిగిన  ఒక సీన్ ను తీసుకొని చేయడం జరిగింది.ఇందులో కార్గిల్ వార్ సీక్వెన్స్ ఉంటాయి. హిందీలో ఇది నా ఫస్ట్ డబ్ల్యు మూవీ. అక్కడ కూడా నా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నా కూడా  పాన్ ఇండియా మూవీ అవ్వడంతో నాకు చాలా నెర్వస్ గా కూడా ఉంది. 

ఇండస్ట్రీ అనేది చాలా క్రియేటివిటీ ఫీల్డ్. టెక్నికల్ గా ఇక్కడికి అక్కడికి తేడా అనేది ఏమీ లేదు. ఒకదానికి ఒకదానికి నేనెప్పుడూ కంపేర్ చేసుకోను. ఒక్కో డైరెక్టర్కి ఒక్కొక్క విజనరీ, క్రియేటివిటీ ఉంటుంది. అంతే కానీ వారిని వీరిని కంపెర్  చేసుకోలేను.  డైరెక్టర్ అద్వైత్ చందన్ చాలా మంచి డైరెక్టర్ తను నాకు చాలా బాగా గైడ్ చేశాడు.

నాకు స్పెషల్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను స్పెషల్ క్యారెక్టర్స్ అంటూ ఏమి చేయలేదు. ఇందులోనే మొదటిది. ఇకముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను.

మరిన్ని వార్తలు