హ్యపీ బర్త్‌ డే శౌర్య.. అదిరిపోయిన ‘లక్ష్య’ టీజర్‌

22 Jan, 2021 11:47 IST|Sakshi

ఆర్చరీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''లక్ష్య''. యువ నటుడు నాగశౌర్య జన్మదినం సందర్భంగా గురువారం చిత్రబృందం లక్ష్య టీజర్‌ విడుదల చేసింది. ఈ సినిమా శౌర్యకు ఇది 20వ చిత్రం. ధీరేంద్ర సంతోశ్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రూపుదిద్దుకుంటోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పార్థు పాత్రలో ఆర్చరీ ఆటగాడుగా నాగశౌర్య నటిస్తున్నాడు. 'చాలా మందికి ఆడితే గుర్తింపు వస్తుంది.. కానీ ఎవడో ఒకడు పుడతాడు.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు' అంటూ జగపతిబాబు డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. 'పడి లేచిన వాడితో పందెం వేయడం చాలా ప్రమాదకరం' అంటూ వచ్చిన 'లక్ష్య' టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శౌర్య సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తున్నాడు. హీరోయిన్‌గా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్‌ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు టీజర్‌ అదిరిపోవడంతో నాగశౌర్య ఖాతాలో మరో విజయం పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే ఆర్చరీ నేపథ్యంగా దేశంలో రూపొందుతున్న మొదటి సినిమా ఇదే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు