'జాంబిరెడ్డి' తర్వాత మరో థ్రిల్‌ ఇచ్చేందుకు రెడీ | Sakshi
Sakshi News home page

'జాంబిరెడ్డి' తర్వాత మరో థ్రిల్‌ ఇచ్చేందుకు రెడీ

Published Sun, Aug 20 2023 5:04 AM

Nene Naa movie release date fix - Sakshi

పురాతన వస్తువులను వెలికి తీసే పని మీద ఉంటుంది ఆమె. ఎందుకంటే ఆమె పురావస్తు శాస్త్రవేత్త. వృత్తిలో భాగంగా పరిశోధనలు చేస్తున్నప్పుడు అనుకోని విధంగా కొన్ని ఘటనలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అనే సస్పెన్స్‌కి సమాధానం ‘శూర్పణగై’ సినిమా. 

‘జాంబిరెడ్డి’ సినిమాతో హిట్‌ అందుకున్న ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ పై తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘నేనే నా’ పేరుతో విడుదల కానుంది. అక్షర గౌడ, అలీ ఖాన్, జై ప్రకాష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.  ‘‘1920, ప్రస్తుతం.. ఇలా రెండు విభిన్న కాలాల నేపథ్యంలో ఫ్యాంటసీ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని యూనిట్‌ పేర్కొంది. 

Advertisement
Advertisement