‘గతంలో ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్‌.. ఇప్పుడు రవి కృష్ణతో రిలేషన్‌!’

24 Jun, 2021 22:02 IST|Sakshi

బుల్లితెరపై హీరోయిన్‌కు సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్న నటి నవ్య స్వామి. కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. నా పేరు మీనాక్షి అనే సీరియల్‌తో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకున్న నవ్య కన్నడ, తమిళంలో పలు సీరియల్స్‌లో నటించింది. ఇక తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. ఈ నేపథ్యంలో తను నటించిన ఆమె కథ సీరియల్‌ సహ నటుడు రవి కృష్ణతో ప్రేమాయణం సాగిస్తుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పలు ఇంటర్వ్యూలో నవ్య అవి వట్టి పుకార్తేనని, తమ మధ్య ఏం లేదని స్పష్టిచేసింది. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లు, షోలు చేయడం, నవ్య షేర్‌ చేసిన ఫొటోలకు రవి కృష్ణ లవ్‌ సింబల్స్‌తో కామెంట్స్‌ చేయడం చూస్తుంటే ఆ వార్తలకు మరింత బలం చూకూరుతుంది. తాజాగా ఆమె ఫొటోపై రవి కృష్ణ ఇలాగే స్పందించడం చూసి నెటిజన్లు వీరి ప్రేమయాణం గురించి సోషల్‌ మీడియాలో చర్చికుంటున్నారు. ఓ నెటిజన్‌ ‘గతంలో నవ్య స్వామి అవిష్‌ గౌడ్‌ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అతడితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ చేసిన కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో నవ్య, రవి కృష్ణల రిలేషన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది.

చదవండి:
ఓ పార్టీలో చేదు అనుభవం, భయమేసి ఇంటికెళ్లి ఏడ్చాను: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు