ఖరీదైన కారు కొన్న టీవీ నటి

15 Jan, 2021 17:07 IST|Sakshi

ముంబై: హిందీ బుల్లితెర నటి, ‘నాగిన్’‌ 4 ఫేం నియా శర్మ ఖరీదైన కారును కొన్నారు. రూ. 87.90 లక్షలు(ఎక్స్‌- షోరూం) వెచ్చించి వోల్వో ఎక్స్‌సీ90 డీ5 ఇన్స్‌క్రిప్షన్‌ ఎస్‌యూవీ కొత్త మోడల్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఆమె.. ‘‘సంతోషాన్ని కొనుక్కోలేం. కానీ కార్లు కొనుక్కోవచ్చు. వాటితో ఆనందం కూడా’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఏక్‌ హజారోం మే మేరీ బహన్‌ హై, జమాయి రాజా, నాగిన్‌ వంటి హిందీ హిట్‌ సీరియళ్లతో నియా శర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బోల్డ్‌ నటిగా పేరొందిన ఆమె.. ప్రముఖ రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్‌ ఇండియా’ విజేతగా కూడా నిలిచారు. (చదవండి: ఖరీదైన కారు కొన్న శివజ్యోతి)

ఈ అడ్వెంచరస్‌ షోలో.. నీటితో నింపి లాక్‌ చేసిన పేటికలో గడపడం.. బాంబులను దాటుకుంటూ ముందుకు సాగడం.. బురదలో ఈత కొట్టడం, కొండచిలువలను తప్పించుకుంటూ, పైకి ఎగబాకుతూ, గ్లాసు పగులకొట్టి నెక్లెస్‌ను తీసుకురావడం వంటి టాస్కులను నియా శర్మ సమర్థవంతంగా పూర్తి చేశారు. ఎలక్ట్రిక్‌ షాకులకు గురిచేసినా తట్టుకుని నిలబడి టైటిల్‌ను సొంతం చేసుకుని ధీశాలిగా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఎంతో సురక్షితమైనవిగా భావించే వోల్వో కంపెనీ వాహనాలపై సెలబ్రిటీలు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారన్న సంగతి తెలిసిందే. బీ-టౌన్‌లోని చాలా మంది ప్రముఖుల దగ్గర భిన్నరకాల వోల్వో ఎస్‌యూవీలు ఉన్నాయి. కాగా చాలా ఏళ్లుగా ఎక్స్‌సీ90 మోడల్‌ వోల్వో కార్లను భారత్‌లో విక్రయిస్తున్న కార్ల సంస్థ, 2017లో బెంగళూరులో లోకల్‌ అసెంబ్లీ యూనిట్‌ను ప్రారంభించింది. నియా శర్మ కొనుగోలు చేసిన కారు డీజిల్‌ వర్షన్‌.(చదవండి: ట్రోఫీని సొంతం చేసుకున్న నియా శర్మ)

A post shared by Nia Sharma (@niasharma90)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు