Pawan Kalyan Bro Movie Issue; Ambati Rambabu Comments, Producers Reaction - Sakshi
Sakshi News home page

Bro Movie: ఆ డబ్బుతో సినిమా.. ఎవరేం అంటున్నారు?

Published Wed, Aug 2 2023 1:56 PM

Pawan Kalyan Bro Movie Issue Ambati Rambabu Comments - Sakshi

పవన్ కల్యాణ 'బ్రో'.. బాక్సాఫీస్ దగ్గర చల్లబడింది. 50, 100 కోట్ల కలెక్షన్స్ అని హడావుడి చేస్తున్నారు కానీ అదంతా ఉత్తిదే. ఎందుకంటే అంత డబ్బులు వస్తే ఒక్క పోస్టర్ అయినా రిలీజ్ చేయాలి. కానీ ఆ ఊసే లేదు. దీనిబట్టే అర్థమవుతోంది. సినిమాకు టాక్ ఫుల్.. వసూళ్లు నిల్ అని. మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులు చెప్పేది వింటే.. 'బ్రో' నిర్మాణం, బడ్జెట్‌పై ఫ్యాన్స్‌కి కూడా కొత్త డౌట్స్ వస్తాయి. 

(ఇదీ చదవండి: సినిమాల కోసం రాజకీయాలను వాడుకుంటున్న పవన్‌)

ఏం జరిగింది?
ఓటీటీలో రిలీజైన తమిళ సినిమా 'వినోదయ సీతం'. తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. పవన్ రీమేక్ చేశాడు. తాజాగా థియేటర్లలో రిలీజ్ అయితే.. ఫ్యాన్స్‌కి తప్ప మిగతా ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. 'బ్రో' చూసిన వాళ్లని అడిగితే.. దీనిపై మీకే క్లారిటీ వచ్చేస్తుంది! ఈ సినిమాలో అవసరం లేకున్నా శ్యాంబాబు అనే పాత్ర పెట్టి, ఏపీ మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు. దీనిపై నటుడు పృథ్వీరాజ్ అవాకులు చవాకులు పేలడం వివాదం మరింత ముదిరేలా చేసింది.

అంబటి సెటైర్స్
తాజాగా ప్రెస్‌మీట్‌ పెట్టిన మంత్రి అంబటి రాంబాబు.. 'బ్రో' నిజస్వరూపం బటపెట్టారు. 'కలెక్షన్స్ పెంచుకునేందుకు దర్శకనిర్మాతలు తాపత్రాయ పడుతున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాని అద్భుతమని చెబుతున్నారు. కలెక్షన్స్ రోజురోజుకీ దారుణంగా పడిపోతున్నాయి. సినిమాను సినిమాగా తీయాలి. పైశాచికానందం పొందాలనుకుంటే హిట్ కాదు. పవన్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా 'బ్రో'కు రాలేదు. బ్లాక్ మనీని వైట్ చేసుకునే కుట్ర ఈ మూవీ వెనుక ఉంది. ఈ మూవీ నిర్మాత టీడీపీకి చెందిన విశ్వప్రసాద్. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని ఆయన ద్వారా టీడీపీ అందజేసింది' అని అంబటి చెప్పుకొచ్చారు. అలానే 'బ్రో' నిర్మాతలకు అమెరికా నుంచి అక్రమంగా హవాలా రూపంలో డబ్బు వచ్చిందని చెబుతూ, వైసీపీ ఎంపీలతో పాటు దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేశారు.

(ఇదీ చదవండి: సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!)

డబ్బు రూటింగ్
వైసీపీ నేత రవిచంద్రారెడ్డి కూడా 'బ్రో' చిత్రంపై ఆరోపణలు చేశారు. ఈ సినిమా కోసం ఫారెన్ మనీ రూటింగ్ జరిగిందని ఆరోపించారు. నిర్మాతలు పవన్‌కు ఎంత డబ్బు ఇచ్చారనే దానిపై విచారణ జరపాలని, నిజాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈడీ జోక్యం చేసుకోవాలని అన్నారు. పై విషయాలన్నీ చూస్తుంటే.. 'బ్రో' వెనక హవాలా హస్తం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాలన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

నిర్మాత రియాక్షన్
అంబటి ప్రెస్‌మీట్ తర్వాత ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో మాట్లాడిన 'బ్రో' నిర్మాత విశ్వప్రసాద్.. నిబంధనల ప్రకారమే పెట్టుబడులు పెట్టామని చెప్పారు. పవన్‌కి ఎంతిచ్చామో, సినిమాకు ఖర్చు చేసిన మొత్తం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విదేశీ నిధులు ఆర్బీఐ రూల్స్ ప్రకారమే వచ్చాయని, ఏజెన్సీలు వస్తే లెక‍్కలు చూపిస్తామని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!)

Advertisement
Advertisement