నెట్టింట రచ్చ చేస్తున్న పవన్‌ ‘హరిహర వీరమల్లు’ మేకింగ్‌ వీడియో

28 Jun, 2021 21:38 IST|Sakshi

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా అది వైరల్‌ అయిపోతుంది. ఈ మధ్య మేకింగ్ సమయంలో ఏదో ఓ సన్నివేశం, ఫోటోలాంటివి లీక్‌ కావడం మామూలుగా మారింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఓ వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

గతంలోనూ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం మేకింగ్‌ సమయంలో ఓ ఫోటో ఇలానే బయటకు రాగా, అప్పట్లో అది వైరల్‌గా మారడమే గాక  చిత్ర బృందం దాన్నే టైటిల్ లోగోలో పెట్టేయడం విశేషం. చాలా కాలం తర్వాత పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో అభిమానులకు ముందుకు వచ్చి ట్రీట్‌ ఇచ్చాడనే చెప్పాలి. కాగా ఇప్పుడు పవర్‌ స్టార్‌ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

కాగా పవర్‌ స్టార్‌ ఇలాంటి పాత్రల్లో నటించడం ఇదే మొదటి సారి కావడంతో ఈ సినిమాపై అంచానాలు ఇప్పటికే ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక అభిమానులైతే వాళ్ల హీరోని సరికొత్తగా చూడబోతున్నామని సినిమా విడుదల తేది కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ వీడియో లీక్‌ పవన్‌ ఫ్యాన్స్‌కి జోష్‌నిచ్చిందనే చెప్పాలి. ఈ వీడియోలో.. మల్ల యోధులు సై అంటుంటే.. ఎదురుగా పవన్ నిలబడి ఉంటాడు. ఇక వారి చుట్టూ ఉన్న మనుషులు కిందికి వంగి కాళ్ల మీద కూర్చన్నారు. చూస్తుంటే ఈ వీడియో సినిమాలో కీలకమైన పోరాట దృశ్యానికి సంబంధించిందిగా అనిపిస్తోంది. 

చదవండి: ఎక్కడా తగ్గేదే లే.. ‘రాధేశ్యామ్‌’ను వెనక్కి నెట్టి టాప్‌లో ‘పుష్ప’


 

మరిన్ని వార్తలు