Pooja Hegde: పవన్‌-హరీశ్‌ శంకర్‌ మూవీ నుంచి తప్పుకున్న పూజా! అందుకేనా?

1 Jun, 2022 20:54 IST|Sakshi

లక్కీ లెగ్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన బ్యూటీ పూజా హెగ్డే. ఆమె సినిమాకు ఒకే చేసిందంటే అది హిట్‌ అనేంతగా దర్శకులకు, హీరోలకు సెంటిమెంట్‌గా మారింది ఆమె. ఇలా బడా హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ ‘బుట్టబొమ్మ’ను వరుస ప్లాప్‌లు వెంటాడుతున్నాయి. అయినా పూజా క్రేజ్‌ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకుంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే. అంతేకాదు పలు భారీ చిత్రాల్లో సైతం స్పెషల్‌ సాంగ్స్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర కొత్త టీజర్‌, నాగార్జున లుక్‌ రిలీజ్‌

ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ షాకింగ్‌ న్యూస్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ పవన్‌ కల్యాణ్‌తో భవదీయుడు భగత్‌ సింగ్‌ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పూజా హేగ్డే హీరోయిన్‌ అని ఆ మధ్య హింట్‌ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత తమిళ చిత్రం ‘వినోదయా సితం’ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: హైదరాబాద్‌లో కిన్నెర మొగిలయ్యకు ఇంటిస్థలం, రూ కోటి నగదు.. ఉత్తర్వులు జారీ

దీంతో ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేశ్ సినిమాలో చేయనుంది. మరో వైపు విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’, బాలీవుడ్‌ మూవీ యనిమల్‌లో స్పెషల్‌ సాంగ్స్‌కు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్న పూజా తాను ఈ సినిమాలో చేయలేనని హరీశ్ శంకర్‌కు చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా పూజా ఇటీవల ఆచార్య మూవీతో పాటు, ఎఫ్‌ 3లో స్పెషల్‌ సాంగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు