మలయాళంలో తొలిసారిగా...

3 Dec, 2020 05:59 IST|Sakshi

‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు మలయాళ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌. ఇప్పుడు మరో స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో దుల్కర్‌ మిలటరీ వ్యక్తిగా కనిపిస్తారు. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై ఈ సినిమాను స్వప్నా దత్‌ నిర్మించనున్నారు. ఇందులో దుల్కర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు, మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఒకవేళ పూజా హెగ్డే ఈ సినిమా కమిట్‌ అయితే ఆమె మాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీత దర్శకుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా