Poonam Kaur: పవన్‌ కల్యాణ్‌ సినిమాపై పూనమ్‌ ఫైర్‌.. భగత్‌ సింగ్‌ను కించపర్చాడంటూ..

11 May, 2023 14:15 IST|Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఒకటి. ఇటీవల ఈ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్‌. అందులో పవన్‌ కల్యాణ్‌ కాళ్ల కింద ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పేరు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌. ఇది కచ్చితంగా భగత్‌ సింగ్‌ను కించపరచడమేనని, భగత్‌ సింగ్‌ యూనియన్‌కు దీన్ని రిపోర్ట్‌ చేయండని ట్వీట్‌ చేసింది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ నీకేం పనీపాటా లేదా? మధ్యలో ఎందుకు దూరుతున్నావని ఫైర్‌ అయ్యారు.

తాజాగా పూనం కౌర్‌ మరో ట్వీట్‌ చేసింది. 'స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినప్పటికీ కనీస మర్యాద ఇవ్వాలి. అంతేకానీ ఇలా కించపర్చకూడదు. సినిమా పోస్టర్‌లో ఆయన పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా? ఇది అహంకారమా? లేక అజ్ఞానమా?' అని మండిపడింది. ఇది చూసిన పవన్‌ ఫ్యాన్స్‌ కాంట్రవర్సీలు క్రియేట్‌ చేసి వార్తల్లో ఉందామనుకుంటున్నావా? అని మండిపడుతున్నారు. అసలు నీకు, పవన్‌ కల్యాణ్‌కు ఉన్న గొడవేంటి? అని ప్రశ్నిస్తున్నారు. నీ మీదకు దృష్టి మళ్లాలనే కదా ఇంత రాద్ధాంతం చేస్తున్నావంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. మొత్తానికి పూనమ్‌ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: పెళ్లికి ముందు నా భర్తకు, నాకు వేరేవాళ్లతో ఎఫైర్స్‌ ఉన్నాయి: హీరోయిన్‌

మరిన్ని వార్తలు