పూర్ణ ‘బ్యాక్‌ డోర్’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

21 Feb, 2021 08:59 IST|Sakshi

‘‘బ్యాక్‌ డోర్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ చూస్తే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలి’’ అని హీరో ఆది సాయికుమార్‌ అన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో, యువ కథానాయకుడు తేజ ముఖ్యపాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ సమర్పణలో బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని ఆది సాయికుమార్‌ విడుదల చేశారు. ‘‘ఈ సినిమాతో దర్శకుడిగా బాలాజీకి మంచి పేరు రావాలి’’ అన్నారు దర్శకుడు వీరభద్రం చౌదరి. బి.శ్రీనివాసరెడ్డి, కర్రి బాలాజీ, సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ రెడ్డి, తేజ, నిర్మాత తిరుపతిరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్‌ విక్రమ్‌ రమేష్‌ తదితరులు ఫస్ట్‌ లుక్‌ రిలీజులో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రేఖ, కో–ప్రొడ్యూసర్‌: ఊట శ్రీను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు