Priyanka Chopra Trolled By Netizens For Not Watching SS Rajamouli RRR Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై ప్రియాంక చోప్రా షాకింగ్‌ కామెంట్స్‌.. నెటిజన్స్‌ ఫైర్‌

Published Tue, May 16 2023 4:06 PM

Priyanka Chopra Trolled For Not Watching Ss Rajamouli Rrr Movie - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా సత్తా చాటుతుంది. హాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఓ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూశారా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. లేదు నాకు అంత సమయం లేదు. నేను సినిమాలు చూడను. కానీ టీవీ షోలు చూస్తుంటా అంటూ బదులిచ్చింది ప్రియాంక. కాగా ఆస్కార్‌ ప్రమోషన్స్‌ కోసం యూఎస్‌ వెళ్లిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు ప్రియాంక చోప్రానే స్వయంగా ఆతిథ్యం ఇచ్చింది.

అలాంటిది సినిమా చూడలేదని చెప్పడం గమనార్హం.కాగా ఆస్కార్ సాధించిన ఇండియన్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి.. సినిమా చూసేంత సమయం తనకు లేదని ప్రియాంక చెప్పడంపై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ అయ్యిండి, ఇన్ని అవార్డులు సాధించిన సినిమాను చూసేందుకు రోజులో కనీసం 3గంటలు కూడా సమయం లేదా అంటూ ప్రియాంక తీరును విమర్శిస్తున్నారు. 

Advertisement
Advertisement