‘వెట్రిని కొత్త చిత్రం మరో స్థాయికి తీసుకెళ్తుంది’

20 Apr, 2021 07:48 IST|Sakshi

యువ నటుడు వెట్రి కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. 8 తూట్టాగల్‌ చిత్రంతో కథానాయకుడిగా రంగప్రవేశం చేసిన ఈయన ఆ చిత్ర విజయంతో వరుసగా కథాబలం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. తాజాగా పిక్చర్‌ బాక్స్‌ కంపెనీ నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ సంస్థ ఇంతకుముందు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేసింది. ఈ చిత్రం ద్వారా శ్యామ్‌మనోహరన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన ఇంతకుముందు పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం గురించి నిర్మాత అలెగ్జాండర్‌ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఉన్న అనుభవంతో ప్రేక్షకుల అభిరుచిని కొంతవరకు గ్రహించానన్నారు. దర్శకుడు శ్యామ్‌మనోహరన్‌ చెప్పిన కథ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనిపించిందన్నారు. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. మిస్టరీ కథా చిత్రాల్లో చివరి సమావేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు.

అయితే ఈ చిత్రం ఆది నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందని తెలిపారు. చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెట్రిని ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కథానాయిక ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, వేసవి కాలం ముగిసిన తర్వాత చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాత తెలిపారు.

చదవండి: కేసీఆర్‌ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ పేరు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు