పుష్ప 2 నుంచి ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie First Song: పుష్ప 2 నుంచి ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది

Published Thu, Apr 25 2024 3:51 PM

Pushpa 2 The Rule First Song Promo Out Now - Sakshi

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం (ఏప్రిల్ 24) రిలీజ్ చేశారు. కొద్దిరోజుల క్రితమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను  రిలీజ్ చేసిన మేకర్స్‌.. తాజాగా ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పూర్తి పాటను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. 

పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం  ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.  పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ చిత్రం బన్నీ మార్కెట్‌  స్థాయిని పెంచేలా ఉంది. ఈ సినిమా సుమారు రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్‌ థియేట్రికల్ హక్కులు రూ.  200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నార్త్‌లో ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్‌ అవార్డు అందుకున్న బన్నీ.. తగ్గేదే లే అంటూ ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్‌ను విస్తరిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే రెండో భాగాన్ని తెరకెక్కించారు మేకర్స్‌ . ఈ చిత్రం కోసం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ వారు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ప్రధాన బలమని చెప్పవచ్చు.

Advertisement
Advertisement