Pushpaka Vimanam Movie Twitter Review In Telugu | Anand Deverakonda | Saanve Megghana - Sakshi
Sakshi News home page

Pushpaka Vimanam Twitter Review: ‘పుష్పక విమానం’ఎలా ఉందంటే..

Published Fri, Nov 12 2021 8:21 AM

Pushpaka Vimanam Movie Twitter Review In Telugu - Sakshi

Pushpaka Vimanam Movie Twitter Review In Telugu: దొరసాని, మిడిల్‌ క్లాస్‌మెలోడీస్‌ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ. ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్‌ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు.  కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవ‌ర‌కొండ సరసన శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు.పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబర్‌ 12)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విటర్‌ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.

ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా కామెడీకి పెద్ద పీట వేశారట. ఫస్టాప్‌ అంత సోసోగా సాగుతుదంట. భార్య మిస్సయ్యిందనే పాయింట్ చూస్తూనే కథ తిరుగుతుందట. కీలకమైన ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందట.  ఇక సెకండాఫ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ ఎంట్రీ ఇచ్చి విచారణ కొనసాగించడం లాంటి సీన్స్, అక్కడక్కడా కొన్ని ట్విస్ట్స్ ఇలా కథను ముందుకు తీసుకెళ్లారట.

Advertisement
Advertisement