రుద్రన్‌గా వస్తోన్న లారెన్స్‌..

29 Oct, 2020 19:53 IST|Sakshi

ఒక డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకుని.. దర్శకుడిగా మంచి ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు రాఘవ లారెన్స్‌. సినిమాలతోనే కాక సమాజ సేవతో కూడా అభిమానులకు సంపాదించుకున్నారు. గురువారం లారెన్స్‌ పుట్టిన రోజు. సందర్భంగా రుద్రన్ అనే తన కొత్త సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది చూస్తుంటే ఈ సారి మరో మ్యాజిక్ ఏదో క్రియేట్ చేయబోతున్నాడని అర్ధమవుతోంది. మూనీ సీక్వెల్స్‌తో ఇన్నాళ్లు ఊహించని విధంగా బయపెట్టిస్తూనే నవ్వించిన లారెన్స్ నెక్స్ట్ మరో డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్‌తో రానున్నట్లు ఈ పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. కేవలం బయపెట్టడమే కాకుండా మంచి సందేశాలను ఇచ్చేలా సినిమాలను తేరకెక్కించే లారెన్స్ ఇప్పుడు కూడా అదే తరహాలో కొత్త కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అంధించనున్నారు. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను మిగతా భాషల్లో కూడా భారీగా రిలీజ్ చేయాలని కుదిరితే పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. (చదవండి: హాట్ ‌టాపిక్‌గా మారిన లారెన్స్‌ ట్వీట్)

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతూనే హీరోగా కూడా కనిపించారు లారెన్స్‌. ఇక ఇప్పుడు హిందీలో కూడా లక్ష్మీ బాంబ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమా కాంచన సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లారెన్స్‌ చంద్రముఖి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్‌ మొత్తాన్ని కరోనా వైరస్‌ సహాయక చర్యల కోసం వినియోగించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు