జోడీ కుదురుతుందా?

19 Feb, 2021 03:24 IST|Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఉంటుందని టాక్‌. ఎప్పటిలానే శంకర్‌ స్టయిల్‌లో భారీ సెట్టింగ్స్‌తో ఈ సినిమా ఉంటుం దని వార్త. ఈ సినిమాలో హీరోయి¯Œ గా రష్మికా మందన్నా పేరుని పరిశీలిస్తున్నారని టాక్‌. రామ్‌చరణ్, రష్మికా ఇప్పటి వరకూ జోడీగా నటించలేదు. ఈ కాంబినేష¯Œ  కొత్తగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. తొలిసారి ఆర్‌ అండ్‌ ఆర్‌ కలసి యాక్ట్‌ చేస్తారా? చూడాలి. ప్యా¯Œ  ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు