పాన్ ఇండియా వైపు టాలీవుడ్ స్టార్స్ పరుగులు

18 Jul, 2021 21:15 IST|Sakshi

భాషతో సంబంధం లేకుండా పాన్‌ ఇండియా సినిమాపై దృష్టి పెట్టారు టాలీవుడ్‌ హీరోలు, డైరెక్టర్స్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రపంచ మార్కెట్‌ మీదనే కన్నేశారు. గతంలో మాదిరి ఒక భాషకి పరిమితం కాకుండా... రెండు మూడు భాషలు లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగాలనేదే అందరి టార్గెట్‌. అందుకే పాన్‌ ఇండియా లెవెల్‌లో కొత్త కాంబినేషన్స్‌కు ట్రెండ్ ఊపందుకుంది.

వంశీ  పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాతగా దలపతి విజయ్‌ హీరో గా తెలుగు, తమిళ భాషల్లో పాన్‌ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరో 6 నెలల్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు దర్శక, నిర్మాతలు. 

ఇక మరో తమిళ స్టార్‌ ధనుష్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ములతో సినిమా చేయునున్నాట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ  సినిమా నెక్ట్‌ జనవరి నుండి సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తుంది అని టాక్‌. అంతే కాకుండా ధనుష్‌ మరో తెలుగు దర్శకుడితోనూ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. 

రామ్‌ చరణ్‌ 15 వ సినిమాగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు . సుమారు 500 కోట్ల తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది.ఈ సినిమా ద్వారా ఇండియన్‌  పొలిటికల్‌ సిప్టమ్‌ మీద స్ట్రాంగ్‌  సెటైర్స్‌ వేయనున్నారట శంకర్‌. అంతే కాకుండా ఈ పాన్ ఇండియా మూవీలో అమితా బచ్చన్‌ ఓ కీలకపాత్ర పోషించనున్నారు . 

కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తో ప్రభాస్‌ 'సలార్‌'  సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మెదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకొని  రెండు షెడ్యూల్‌ లోకి కూడా అడుగుపెట్టారు చిత్ర యూనిట్‌. సుమారు 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా  మీద సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలే  ఉన్నాయి . దీంతో పాటు ఖైదీ ఫేమ్‌ లోకేష్‌ కనకరాజ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట ప్రభాస్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ లో ఈ సినిమా తెరకెక్కనుంది అని టాక్‌. 

రామ్‌తో తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ మధ్యనే సినిమా స్టార్ట్‌ చేసారు.ఈ సినిమా  షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతుంది . ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ హీరోగా మురగాదాస్‌ దర్శకత్వంలో గజనీ 2  సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు నిర్మాత అల్లు అరవింద్‌. 

సూర్య కోసం బోయపాటి శ్రీను ఓ భారీ యాక్షన్ ధ్రిల్లర్‌ను  రెడీ చేసాడట.  శివకార్తికేయన్‌ కోసం 'జాతిరత్నాలు' ఫేమ్‌ అనుదీప్‌ కథలు సిద్ధం చేశారు అని తెలుస్తుంది . 'రాక్షసుడు-2' చిత్రం కోసం విజయ్‌ సేతుపతి రంగంలోకి దిగే అవకాశాలున్నాయనీ కూడా  ప్రచారం సాగుతోంది. 

మరిన్ని వార్తలు