రామ్‌చరణ్‌కి గోల్డెన్‌ బాలీవుడ్‌ యాక్టర్‌ అవార్డు 

10 Dec, 2023 00:19 IST|Sakshi

హీరో రామ్‌ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 2023 పాప్‌ గోల్డెన్‌ అవార్డ్స్‌లో గోల్డెన్‌ బాలీవుడ్‌ యాక్టర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని పాప్‌ గోల్డెన్‌ కమిటీ అధికారికంగా వెల్లడించింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌ చరణ్‌తో పాటు ఈ అవార్డు కోసం షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకోన్, అదా శర్మ, విషెస్‌ బన్సల్, అర్జున్‌ మాథుర్, రిద్ధి డోగ్రా, రాశీ ఖన్నా నామినేషన్స్‌ దక్కించుకోగా ఫైనల్‌గా రామ్‌ చరణ్‌ని వరించింది. ఇటీవలే రామ్‌ చరణ్‌ ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ (ఆస్కార్‌) క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజాగా ‘గోల్డెన్‌ బాలీవుడ్‌ అవార్డు’ కి ఎంపికవడంతో ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

>
మరిన్ని వార్తలు