రామ్‌- పూరి కాంబో.. డబుల్‌ మాస్‌ అప్‌డేట్‌ వచ్చేసింది! | Sakshi
Sakshi News home page

Double Ismart: డబుల్ ఇస్మార్ట్‌.. ఊర మాస్‌ యాక్షన్‌ అప్‌డేట్‌!

Published Tue, May 14 2024 8:01 PM

Double ISmart Teaser Release Tomorrow At This Time

టాలీవుడ్‌ యంగ్ హీరో రామ్‌ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. గతంలో పూరి దర్శకత్వంలో రూపొందించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ రిలీజ్‌ తేదీని ప్రకటించారు. రామ్ బర్త్‌ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. 

ఈనెల 15న టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10:03 నిమిషాలకు టీజర్‌ విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజైన వీడియోలో ఇస్మార్ట్ శంకర్‌ సీన్స్‌ను జోడించారు. ఈ మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్స్‌లో అభిమానులు చేసిన సందడితో కూడిన సన్నివేశాలు మాస్‌ ఇమేజ్‌ను గుర్తుచేస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్‌ టీజర్‌తో రామ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. 

Advertisement
 
Advertisement
 
Advertisement