Ram Pothineni Marriage With His Girl Friend, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Pothineni Marriage Rumours: ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?!

Published Sun, Jun 26 2022 6:49 PM

Ram Pothineni Wedding News Goes Viral - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో రామ్‌ పోతినేని ఒకరు. చాక్లెట్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న రామ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. ఈ హీరో తన చిన్ననాటి క్లాస్‌మేట్‌తో లవ్‌లో ఉన్నాడని, కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న వీళ్లిద్దరూ ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు నటించిన వారియర్‌ మూవీ జూలై 14న రిలీజ్‌ కాబోతున్న విషయం తెలిసిందే కదా!

ఈ సినిమా విడుదలైన తర్వాత రామ్‌ ప్రేయసితో ఎంగేజ్‌మెంట్‌ జరగనుందట. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. పెళ్లి కూడా ఇదే ఏడాది చేసుకోనున్నారని టాక్‌. కాగా గతంలో రామ్‌ పెళ్లి గురించి స్పందిస్తూ అది మన చేతుల్లో ఉండదని, పెళ్లనేది జరగాల్సిన సమయంలో జరుగుతుందన్నాడు. ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్నారు ఫ్యాన్స్‌. అయితే కొందరు మాత్రం ఇది నిజం కాకపోవచ్చని కొట్టిపారేస్తున్నారు. రామ్‌ పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే అతడు స్పందించేవరకు వెయిట్‌ చేయాల్సిందే!

ఇకపోతే రామ్‌ నటించిన వారియర్‌ తెలుగు, తమిళంలో రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించింది. మరోవైపు రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

చదవండి: మావాడికి నేను ఎక్స్‌పోజింగ్‌ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా..
నా డబ్బు అడిగితే నిర్మాత బెదిరిస్తున్నాడు.. నటుడి ఫిర్యాదు

Advertisement
Advertisement